భారత్... 2030లో 5.8 శాతం ఉత్పాదకతను నష్టపోతుందని ఓ సర్వే అంచనా వేసింది. ఐరాస పరిధిలోని అంతర్జాతీయ కార్మిక సంస్థ-ఐఎల్ఓ చేసిన ఈ సర్వేలో మరికొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
భారత్ కోల్పోయే ఉత్పాదకత... దాదాపు 3 కోట్ల 40 లక్షల ఉద్యోగాలకు సమానమని పేర్కొంది సర్వే. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 2.2 శాతం ఉత్పాదకత తగ్గొచ్చని.. ఇది 8 కోట్ల ఉద్యోగుల శ్రమతో సమానమని లెక్కగట్టింది ఐఎల్ఓ.
ఇదీ కారణం...
ఉత్పాదకత కోల్పోవడానికి భూతాపమే ప్రధాన కారణమని తెలిపింది అంతర్జాతీయ కార్మిక సంస్థ. 21వ శతాబ్దం ముగిసే నాటికి 1.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరగవచ్చన్న అంచనాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించింది.