తెలంగాణ

telangana

ETV Bharat / business

సరిహద్దు వివాదం ప్రభావం ద్వైపాక్షిక వాణిజ్యంపై పడనుందా? - భారత్​ చైనా వాణిజ్య వివాదాలు

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ ప్రభావం ఇరు దేశాల వాణిజ్యంపై పడనుందా? ఈ విషయంపై వాణిజ్య నిపుణులు ఏం చెబుతున్నారు?

India china trade
భారత్​ చైనా వాణిజ్యం

By

Published : Jun 18, 2020, 11:55 AM IST

భారత్-చైనా సరిహద్దుల వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ఇరు దేశాల వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాలపై తక్షణమే ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉద్రిక్తతలు మరింత పెరిగితే మాత్రం ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందని అంటున్నారు. వాణిజ్య పరంగా పరస్పర అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు.

అలా చేస్తే ఎగుమతులపైనా ప్రభావం..

'భారత ఎగుమతులకు చైనా పెద్ద మార్కెట్​గా ఉంది. వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు ఇరు సరిహద్దు దేశాలకు ఎగుమతులు పెంచేందుకు కావాల్సిన మార్గాలను అన్వేశించాల్సిన అవసరం ఉంది.' అని హ్యాండ్ టూల్స్ అసోసియేషన్​ అధ్యక్షుడు సుభాశ్​ చందర్ రల్హాన్ అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చైనా దిగుమతులపై అంక్షలు విధిస్తే.. ఆ ప్రభావం ఎగుమతులపైనా పడుతుందని పేర్కొన్నారు. ఇది కాకుండా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగితే మాత్రం వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు.

ఈ సమస్యకు ఇరు దేశాలు వీలైనంత త్వరగా తెరదించకుంటే.. వాణిజ్య పరంగా ఇబ్బందులు తప్పకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత్​-చైనా వాణిజ్యం ఇలా..

2019-20 (ఏప్రిల్-ఫిబ్రవరి) మధ్య భారత్ నుంచి చైనాకు 15.54 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ఇదే సమయంలో చైనా నుంచి భారత్​కు 62.38 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయి.

2018-19లో 16.75 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 70.32 బిలియన్​ డాలర్ల దిగుమతులు జరిగాయి.

ఇదీ చూడండి:పన్నెండో రోజూ పెరిగిన పెట్రోల్​, డీజిల్​ ధరలు

ABOUT THE AUTHOR

...view details