ప్రభుత్వం, ఆర్‌బీఐ చేపడుతున్న సరళ పరపతి సమీక్షా విధానాలు, ద్రవ్యపరపతి విధానాల వల్ల ఆర్థిక రికవరీకి భారత్ దగ్గరైనట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ ఎన్.కె. సింగ్ రాసిన 'పోర్ట్రెయిట్ ఆఫ్ పవర్: హాఫ్ ఎ సెంచరీ ఆఫ్ బీయింగ్ రింగ్‌సైడ్' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దాస్ మాట్లాడుతూ 'ఆర్థిక సంస్థలన్నిటి దగ్గరా వృద్ధికి మద్దతునివ్వడానికి సరిపడా మూలధనం ఉంది' అని తెలిపారు. కరోనా పరిస్థితులు స్థిమితపడ్డ వెంటనే అన్ని బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు(ఎన్‌బీఎఫ్‌సీలు) అంతర్గతంగా ఒత్తిడి ఎంత ఉందో పరిశీలన చేసుకోవాలని, మూలధన నిల్వలు పెంచుకోవాలని సూచించారు. కరోనా సంబంధిత సవాళ్లను ఎదుర్కోవడానికి ద్రవ్య విస్తరణ మార్గాన్ని భారత్ పాటిస్తోందని, ఆర్‌బీఐ అమ్ములపొదిలో లేని అస్త్రాలను కూడా వినియోగించామని వివరించారు.
బ్యాంకులకు రూ. లక్ష కోట్లు..