తెలంగాణ

telangana

ETV Bharat / business

'వృద్ధి పెరగాలంటే సుంకాలు తగ్గించాల్సిందే..!'

రానున్న ఐదేళ్లలో దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని కేంద్రం లక్ష్యాంగా పెట్టుకుంది. అయితే ప్రస్తుతం అనేక సవాళ్లు దీనికి అడ్డుపడుతున్నాయి. వీటన్నింటిని దాటి లక్ష్యానికి చేరువవ్వాలంటే పద్దులో సమస్యలను పరిష్కరించాలంటూ భారతీయ అమెరికన్​ వ్యాపార సలహా సంఘం కేంద్రానికి పలు సూచనలిచ్చింది. ఆ సూచనలేంటి? వాటితో లాభమెంత? అనే అంశాలు మీ కోసం.

tax
పన్నులు తగ్గిస్తేనే వృద్ధి

By

Published : Jan 29, 2020, 4:52 PM IST

Updated : Feb 28, 2020, 10:15 AM IST

భారత్‌ ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా పరుగులు తీస్తోంది. కానీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు ఏమాత్రం సహకరించడంలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం పన్నులను క్రమబద్ధీకరించడం సహా.. జీఎస్టీలో సమస్యలను పరిష్కరిస్తేనే భారత్‌ వృద్ధిరేటు పరుగులు తీస్తుందని భారతీయ-అమెరికన్‌ వ్యాపార సలహా సంఘం ప్రభుత్వానికి సూచించింది.

యూఎస్‌ ఇండియా స్ట్రాటజిక్‌ అండ్‌ పార్టనర్‌షిప్‌ ఫోరమ్‌(యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌) ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ను ఈమేరకు అభ్యర్థించింది. పలు రకాల పన్నుల తగ్గింపుతోపాటు, సుంకాల విధానాన్ని సవరించాలని, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా తెరవాలని కోరింది. ఈ చర్యలు ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయని కోరింది. దీంతోపాటు భారీ సంఖ్యలో ఉద్యోగాలను సృష్టిస్తాయని పేర్కొంది. "మొత్తం వ్యాపారాల డిజిటలీకరణ జరుగుతోంది. భారత డిజిటల్‌ టాక్సేషన్‌ విధానం ప్రపంచ స్థాయిలో ఉండాలి. సరళ వాణిజ్య విధానాలు, పన్ను మార్గదర్శకాలు, జీఎస్టీ సమస్యలు, సీఎస్‌ఆర్‌ ఖర్చులు, డిజిటల్‌ టాక్సేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ వంటివి పాటించాలి" అని యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ పేర్కొంది.

మరిన్ని..

  • 2శాతం సీఎస్‌ఆర్‌ ఖర్చును పన్ను మినహాయింపు అంశంగా ప్రకటించాలి.
  • సాంకేతిక, న్యాయ పరమైన సమస్యలు పరిష్కరించి జీఎస్టీ -ఈ ఇన్వాయిసింగ్‌ విధానాన్ని అమలు చేయాలి. సహజవాయును కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి.
  • వ్యాపారలకు అడ్డంకిగా ఉన్న చట్టాలను, కస్టమ్స్‌ చట్టంలోని సంక్లిష్టతను పరిష్కరించాలి. ఇవన్ని పెట్టుబడులను ప్రోత్సహించేలా ఉండాలి.
  • బీమా రంగంలోకి 100శాతం విదేశీ పెట్టుబడులకు అవకాశం ఇవ్వాలి. నిర్వహణ బాధ్యతలు కూడా అప్పగించేలా చూడాలి. అన్‌లిస్టెడ్‌ బీమా కంపెనీల్లో ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్‌ 10శాతం వాటాలను ఉంచుకొనేలా అవకాశం ఇవ్వాలి.
  • మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో ధరలను నియంత్రించే విధానాన్ని తొలగించాలి. భారత్‌లోని శాట్‌కామ్‌ మార్కెట్‌ జాతీయ స్థాయిలో కనెక్టివిటీని సాధించాల్సి ఉంది.
  • టెలికమ్‌ రంగంలో లైసెన్స్‌ ఫీజుపై, స్పెక్ట్రం వినియోగ ఛార్జీలపై జీఎస్టీ తొలగించాలి. ఇవి 5జీ వేగంగా విస్తరించేందుకు దోహదం చేస్తాయి.
  • నిత్యావసరాలపై 5శాతం జీఎస్టీ విధించి , ప్రాణాలను కాపాడే ముందులపై పూర్తిగా తొలగించాలి.

ఇదీ చూడండి:బడ్జెట్‌పై కోటి ఆశలున్నా...ఆర్థిక వ్యవస్థలో 'నిర్మల'త్వం ఏదీ!

Last Updated : Feb 28, 2020, 10:15 AM IST

ABOUT THE AUTHOR

...view details