తెలంగాణ

telangana

ETV Bharat / business

వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7% వృద్ధి నమోదు!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి కాస్త మందగించినా.. 2020-21 భారత్​కు సానుకూలంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా వేసింది. వృద్ధికి ఊతమందించేందుకు కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇందుకు కారణమవుతాయని విశ్లేషించింది.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7% వృద్ధి నమోదు!

By

Published : Oct 23, 2019, 7:42 PM IST

భారత వృద్ధిపై అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్​) కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం వృద్ధి కాస్త నెమ్మదించినా.. వచ్చే ఆర్థిక సంవత్సరం మళ్లీ 7 శాతానికి పైగా నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

ద్రవ్య సంబంధిత ఉద్దీపనలు, కార్పొరేట్​ సుంకం తగ్గిస్తూ కేంద్రం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు వృద్ధికి దోహదం చేస్తాయని ఐఎంఎఫ్​ అసియా పసిఫిక్ విభాగ డిప్యూటీ డైరెక్టర్​ జనాథన్ ఓస్ట్రి అన్నారు.

2019-20 భారత వృద్ధి అంచనాను 6.9 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గిస్తూ ఐఎంఎఫ్​ ఇటీవలే నివేదిక విడుదల చేయడం గమనార్హం.

మేమే ఆశ్చర్యపోయాం...

గత కొన్ని త్రైమాసికాల్లో భారత వృద్ధి మందగమనం ఐఎంఎఫ్​ సహా తమలో చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసినట్లు ఓస్ట్రి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాను తగ్గించేందుకు చాలా కారణాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా.. కార్పొరేట్ నియంత్రణ అనిశ్చితులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల సంక్షోభం, గ్రామీణ ప్రాంతాల్లో మందగమనం వంటివి కొన్ని ప్రధాన కారణాలుగా పేర్కొన్నారాయన.

వృద్ధికి అపార అవకాశాలు..

దక్షిణాసియాలో వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని ఓస్ట్రి తెలిపారు. వస్తు వాణిజ్యమే కాకుండా.. సేవా వాణిజ్యమూ అవసరమన్న ఓస్ట్రి.. భారత్ సహా ఇతర దక్షిణాసియా ఆర్థిక వ్యవస్థల వృద్ధికి ఇది దోహదం చేస్తుందని పేర్కొన్నారు.

గత పదేళ్లలో సేవా రంగ ఎగుమతుల్లో భారత్ నమోదు చేసిన వృద్ధిని ఆయన గుర్తు చేశారు. ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం.. భారత సమాచార సాంకేతిక సేవల ఎగుమతులు 2000లో 6.3 శాతంగా ఉంటే.. 2010లో 17.8 శాతానికి పెరిగినట్లు తెలిసింది.

ఇదీ చూడండి: బీఎస్​ఎన్​ఎల్​కు కొత్త ఊపిరి- కేంద్రం భారీ ప్యాకేజ్

ABOUT THE AUTHOR

...view details