తెలంగాణ

telangana

ETV Bharat / business

2021-22 వృద్ధి రేటు 8.5 శాతం! - జీడీపీపై అంచనాలను సవరించిన ఇక్రా

ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు 8.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగంవంతమైతే వృద్ధి రేటు మరింత పెరిగేందుకు అవకాశాలున్నాయని వెల్లడించింది.

Icra on Indian GDP
వృద్ధి రేటుపై ఇక్రా అంచనాలు

By

Published : Jun 10, 2021, 5:03 PM IST

Updated : Jun 10, 2021, 5:13 PM IST

దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో 2021-22 వృద్ధి రేటు అంచనాలను సవరించింది ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 8.5 శాతంగా నమోదవ్వచ్చని పేర్కొంది.

వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా వేగవంతమైతే.. 2021-22 వృద్ధి రేటు 9.5 శాతానికి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఆర్​బీఐ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు అంచనాలను 9.5 శాతానికి సవరించడం గమనార్హం.

2021-22లో వినియోగదారు ద్రవ్యోల్బణం (సీపీఐ), టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) సగటు వరుసగా.. 5.2 శాతం, 9.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది ఇక్రా.

ఇదీ చదవండి:V-ఆకారపు రికవరీతో జీ-20 దేశాల్లో భారత్ భేష్​!

Last Updated : Jun 10, 2021, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details