ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు (ఏప్రిల్ 1 నుంచి 19) రూ.5,649 కోట్ల పన్ను రీఫండ్ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) ప్రకటించింది. 7.39 లక్షల ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఈ మొత్తాన్ని బదిలీ చేసినట్లు వెల్లడించింది.
ఇందులో 7.23 లక్షల మంది వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు రూ.3,073 కోట్లు.. 15,205 కార్పొరేట్లకు రూ.2,577 కోట్లు రీఫండ్ చేసినట్లు పేర్కొంది ఐటీ.
గత ఆర్థిక సంవత్సరం సీబీడీటీ రూ.2.62 లక్షల కోట్ల రీఫండ్ చేసినట్లు ఐటీ పేర్కొంది. 2.38 కోట్ల పన్ను చెల్లింపుదారులకు ఈ మొత్తాన్ని బదిలీ చేసినట్లు వివరించింది. ఈ రీఫండ్ ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది అనేది మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ రీఫండ్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు నిపుణులు.
2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే(రూ.1.83 లక్షల కోట్లు).. గత ఆర్థిక సంవత్సరం బదిలీ చేసిన రీఫండ్ 43.2 శాతం అధికం కావడం గమనార్హం.
ఇదీ చదవండి:తొలినాళ్లలో ఉద్యోగం కోసం మస్క్ తిప్పలు!