ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రూ.1.29 లక్షల కోట్ల పన్ను రీఫండ్ చేసినట్లు ఆదాయపు పన్ను విభాగం(ఐటీ) బుధవారం ప్రకటించింది. దాదాపు 39.49 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ మొత్తాన్ని పొందినట్లు వివరించింది.
'ఏప్రిల్ నుంచి రూ.1.29 లక్షల కోట్ల పన్ను రీఫండ్'
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు 39.49 లక్షల పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను రీఫండ్ బదిలీ చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) తెలిపింది. వ్యక్తిగత, కార్పొరేట్లకు కలిపి మొత్తం రూ.1.29 లక్షల కోట్లు రీఫండ్ చేసినట్లు వెల్లడించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్ను రీఫండ్ గణాంకాలు
ఇందులో 37,55,428 మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు రూ.34,820 కోట్లు, 1,93,059 కార్పొరేట్లకు రూ.94,370 కోట్లు రీఫండ్ బదిలీ అయినట్లు వివరించింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ).
ఇదీ చూడండి:క్యూ2లో ఎస్బీఐ నికర లాభం 55 శాతం జంప్