క్రెడిట్ స్కోరు రుణ సామర్థ్యాన్ని సూచిస్తుంది. సిబిల్ స్కోరు 300 నుంచి 900 వరకు ఉంటుంది. 700 కంటే ఎక్కువ ఉంటే మంచి స్కోరుగా పరిగణిస్తారు. ఎంత ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉంటే తిరిగి చెల్లించే సామర్థ్యం అంత ఎక్కువగా ఉన్నట్లు లెక్క. ఎక్కువ స్కోరు ఉన్న వారికి వ్యక్తిగత రుణం త్వరగా వస్తుంది.
తక్కువ స్కోరు ఉన్న వారు రుణాలు పొందేందుకు, ముఖ్యంగా వ్యక్తిగత రుణాలు పొందేందుకు ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా రుణం కావాల్సినప్పుడు ఏం చేయాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దం.
తక్కువ వ్యక్తిగత రుణం మొత్తం
తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్నట్లయితే రుణం ఇచ్చేందుకు బ్యాంకులు, ఫినాన్స్ సంస్థలు ఎక్కువ రిస్కు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం.. తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్నవాళ్లు.. మొదటగా తక్కువ మొత్తంలో రుణం తీసుకుని కొన్ని వాయిదాలు చెల్లించిన తరువాత టాప్ అప్ లోన్ తీసుకోవటం ఉత్తమం. దీని వల్ల రుణం ఇచ్చే సంస్థల అనుమానాలు నివృత్తం కావటమే కాకుండా.. తక్కువ మొత్తం వాయిదా వల్ల చెల్లింపుదారుడికి కూడా ఇబ్బంది ఉండదు.