బంగారం విలువైన లోహం. మన దేశంలో ఇది సంప్రదాయం, ఆచారాలు, సెంటిమెంట్‌తో ముడిపడినది. భారతీయులకు, ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం. అయితే ఎంత బంగారం ఒకరి వద్ద ఉండొచ్చు? (gold limit in india) అన్న దానిపై కొంత సందిగ్ధం ఉంది.
ఒక లిమిట్ వరకు(gold limit for individual in india 2021) ఎలాంటి పత్రాలు లేకున్నా అధికారులు బంగారాన్ని సీజ్ చేయరు. లిమిట్ అనంతరం దానికి సంబంధించిన పత్రాలు లేకుంటే.. అదనపు బంగారాన్ని సీజ్ చేసే అవకాశం ఉంటుంది.
వారసత్వంగా వచ్చిన బంగారం, బంగారు నగలపైనా ఎలాంటి పరిమితి లేదు. అయితే బంగారానికి సంబంధించిన వివరాలను ఐటీ రిటర్నులలో పొందుపరచాల్సి ఉంటుంది.
ఇవి గుర్తుంచుకోండి..
- బంగారాన్ని కొనుగోలు చేసినప్పుడు.. వాటికి సంబంధించిన రసీదును దగ్గర ఉంచుకోవాలి. ఎక్స్ఛేంజీ చేసినట్లయితే... వాటికి సంబంధించిన పత్రాలను భద్రంగా పెట్టుకోవాలి.
- వారసత్వంగా వచ్చిన బంగారం విషయంలో వీలునామా లేదా ఇతర పత్రాలను అందుబాటులో ఉంచుకోవటం ఉత్తమం.
- మీకు అందిన బంగారానికి సంబంధించి సంపద పన్ను చెల్లించినట్లయితే.. అది వారసత్వానికి రుజువుగా ఉపయోగపడుతుంది. సంపద పన్ను 2015లో ప్రభుత్వ రద్దు చేసింది. అప్పటి వరకు రిటర్ను దాఖలు చేయాల్సి ఉండేది.
బంగారం పొందిన ఆధారాలు లేకుంటే..
- బంగారం ఎలా వచ్చిందన్న దానికి ఆధారాలు లేకుంటే.. పరిమితి అనేది ఉంటుంది. ఆదాయ పన్ను శాఖ నిబంధనల ప్రకారం.. పెళ్లైన మహిళ 500 గ్రాములు, పెళ్లి కాని మహిళ 250 గ్రాముల వరకు నగలు పెట్టుకోవచ్చు.
- పురుషుడు 100 గ్రాముల బంగారం మాత్రమే అధారాలు లేకుండా దాచుకోవచ్చు. పెళ్లైన వారికి, పెళ్లి కాని వారికి ఇదే వర్తిస్తుంది.
- ఒక కుటుంబంలో భార్య, ఒక పెళ్లి కాని మహిళ, పెళ్లి కాని పురుషుడు ఉన్నట్లయితే మొత్తం ధ్రువపత్రాలు లేకుండా 900 గ్రాముల బంగారం నగలు దాచుకునే వీలుంది.
- పూర్వీకుల నుంచి వచ్చిన బంగారం, కొనుగోలు చేసిన బంగారం రెండూ ఈ పరిమితిలోకి వస్తాయి. అయితే ఇందులోకి బంగారు కాయిన్లు, బిస్కెట్లు రావు. పైన పేర్కొన్ని పరిమితికి లోబడి కాయిన్లు, బిస్కెట్లు ఉన్నప్పటికీ.. అధికారులు దాడులు చేసినట్లయితే సీజ్ అవుతుంది.
- బంధువులు, ఇతరుల బంగారం మీ వద్ద ఉన్నట్లయితే.. ఆ బంగారం పరిమితిలోకి రాదు. దీనికి సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే ఆదనపు బంగారం సీజయ్యే అవకాశం ఉంటుంది.
ఇవీ చదవండి: