రికార్డు స్థాయిలో పెరిగిన పసిడి ధరలు.. కరోనా కాలంలో బంగారు రుణాల డిమాండ్‌ను భారీగా 28.8 శాతం పెంచాయి. ఫలితంగా బంగారు రుణాలిచ్చే ప్రధాన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ఏయూఎం (అసెట్ అండర్ మేనేజ్మెంట్) కూడా భారీగా పెరిగినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నివేదిక తెలిపింది.
పెరిగిన డిమాండ్‌తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బంగారు రుణాల విలువ రూ.4,051 బిలియన్లు దాటొచ్చని డబ్ల్యూజీసీ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సతరం ఈ విలువ రూ.3,448 బిలియన్లుగా తెలిపింది.
పెరిగిన పసిడి ధరలతో.. రుణ గ్రహీతలు అధిక రుణ విలువ పొంది లాభపడితే.. రుణదాతలు తక్కువ లోన్ టూ వాల్యూ (ఎల్టీవీ) నిష్పత్తితో లబ్ధిపొందారని పేర్కొంది డబ్ల్యూజీసీ.