తెలంగాణ

telangana

ETV Bharat / business

'హల్వా' ఉత్సవంలో కేంద్ర ఆర్థిక మంత్రి - NIRMALA SITHARAMAN

బడ్జెట్ పత్రాల ముద్రణ ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హల్వా ఉత్సవాన్ని ప్రారంభించారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి, కార్యదర్శి సహా ఇతర అధికారులకు ఆమె హల్వా పంచారు.

'హల్వా' ఉత్సవం

By

Published : Jun 22, 2019, 5:30 PM IST

Updated : Jun 23, 2019, 12:06 AM IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హల్వా ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆర్థిక కార్యదర్శి సుభాశ్​ చంద్ర గార్గ్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

'హల్వా' ఉత్సవంలో కేంద్ర ఆర్థిక మంత్రి

బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందు ప్రతి ఏటా ఈ హల్వా ఉత్సవం జరపడం రివాజుగా వస్తోంది. ఒక పెద్ద కడాయిలో హల్వా తయారు చేసి అందరికీ పంచుతారు. ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టేవరకు ముద్రణలో పాల్గొనే అధికారులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి.

ఫోన్, ఈ-మేయిల్ లాంటి సౌకర్యాలు కూడా ఉండవు. కార్యదర్శి స్థాయి అధికారులు మినహా ఎవరు ఇళ్లకు వెళ్లేందుకు వీలుండదు. బడ్జెట్​కు సంబంధించిన విషయాల్లో గోప్యత కోసం ఈ నిబంధనలు విధిస్తుంది ఆర్థిక శాఖ.

ఇదీ చూడండి: మీ బీమా ఏజెంట్​కు లైసెన్స్​ ఉందా.?

Last Updated : Jun 23, 2019, 12:06 AM IST

ABOUT THE AUTHOR

...view details