తెలంగాణ

telangana

ETV Bharat / business

వడ్డీ రేట్లు తగ్గించిన ప్రభుత్వ రంగ బ్యాంకులు

దేశంలోని పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. ఎంసీఎల్​ఆర్​ రేటును సుమారు 25 బేసిస్​ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ కొత్త రేట్లు కొన్ని బ్యాంకుల పరిధిలో నేటి నుంచే అమలులోకి రానున్నాయి. ఐఓబీలో నవంబర్​ 1 నుంచి అమలు కానున్నాయి.

వడ్డీ రేట్లు తగ్గించిన ప్రభుత్వ రంగ బ్యాంకులు

By

Published : Oct 11, 2019, 6:16 AM IST

దేశంలోని ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(ఆర్​బీఐ) రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, ఒరియంటల్​ బ్యాంక్​ ఆఫ్​ కామర్స్​, బ్యాంక్​ ఆఫ్​ మహారాష్ట్ర సహా పలు బ్యాంకులు ఎంసీఎల్​ఆర్​ను సుమారు 25 బేసిస్​ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.

బ్యాంకుల తాజా నిర్ణయంతో గృహ, వాహన, ఇతర రుణాలు చౌకగా లభించనున్నాయి.

ఐఓబీ..

ఆర్​బీఐ రెపో రేటును 25 బేసిస్​ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో రిటైల్​, సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు ఈ ప్రయోజనం చేకూరేలా వడ్డీ రేట్లను 8 శాతం చేస్తున్నట్లు ఇండియన్​ ఓవర్​సీస్​ బ్యాంకు ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు నవంబర్​ 1 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది.

బీఓఐ..

బ్యాంక్​ ఆఫ్​ ఇండియా తన రోజువారీ ఎంసీఎల్​ఆర్​ను 15 బేసిస్​ పాయింట్లు, సంవత్సరకాల ఎంసీఎల్​ఆర్​ను 5 బేసిస్​ పాయింట్లు తగ్గించినట్లు వెల్లడించింది. ఈ కొత్త రేట్లు నేటి నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది.

బీఓఎం..

బ్యాంక్​ ఆఫ్​ మహారాష్ట్ర వడ్డీ రేట్లను 10 బేసిస్​ పాయింట్లు తగ్గించింది. ఈ నిర్ణయంతో ఎంసీఎల్​ఆర్​ 8.40 శాతానికి చేరుకుందని తెలిపింది. అక్టోబర్​ 8 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని పేర్కొంది.

సీబీఐ..

పండుగ సీజన్​, రిటైల్​, సూక్ష్మ, చిన్న పరిశ్రమల వర్గాల వినియోగదారులకు ప్రయోజన చేకూర్చేందుకు సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా రెపో ఆధారిత వడ్డీ రేట్లు (ఆర్​బీఎల్​ఆర్​)ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. నేటి నుంచి అమలులోకి వస్తుంది. ఒరియంటల్​ బ్యాంక్​ సంవత్సర కాల రుణాల వడ్డీ రేట్లను 8.35 శాతానికి తగ్గించింది.

ABOUT THE AUTHOR

...view details