వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వల్ల రాష్ట్రాల లోటు తగ్గుతుందని అంచనా వేసినప్పటికీ ఆ అవకాశం లేదని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పీ తెలిపింది. దీనికి సామాజిక, మూలధన వ్యయాల పెరుగుదలే కారణమని 'పబ్లిక్ ఫినాన్స్ సిస్టమ్ ఓవర్వ్యూ: ఇండియన్ స్టేట్స్' అనే నివేదికలో వెల్లడించింది.
" జీఎస్టీ వల్ల పన్ను కట్టే వారి సంఖ్య పెరిగి... ప్రభుత్వ ఆదాయం కూడా అధికమౌతుందని రాష్ట్రాలు అంచనా వేశాయి. రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక, మూలధన వ్యయం చేయాల్సిన పరిస్థితి ఉన్న దృష్ట్యా అవి ఖర్చును తగ్గించుకోలేకపోతున్నాయి. దీనివల్ల ఆదాయం, వ్యయం మధ్య వ్యత్యాసం మునుపటిలానే అధికంగానే ఉంది " అని తెలిపింది.