తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.లక్ష కోట్ల దిగువకు జీఎస్​టీ వసూళ్లు - కరోనా దెబ్బతో తగ్గిన జీఎస్​టీ వసూళ్లు

గత ఎనిమిది నెలలుగా రూ.లక్ష కోట్ల మార్క్‌ దాటుతూ వస్తున్న జీఎస్‌టీ వసూళ్లు.. జూన్​లో నెలలో రూ.92 వేల కోట్లకు పరిమితమయ్యాయి. కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​ వల్ల వసూళ్లు తగ్గినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. అయినప్పటికీ 2020 జూన్​తో పోలిస్తే.. ఈ మొత్తం 2 శాతం ఎక్కువి పేర్కొంది.

GST collection down with Covid lockdown
కరోనా దెబ్బతో తగ్గిన జీఎస్​టీ వసూళ్లు

By

Published : Jul 6, 2021, 4:45 PM IST

కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాలు విధించిన ఆంక్షలు, లాక్‌డౌన్ల కారణంగా జూన్‌లో కేంద్రానికి జీఎస్‌టీ(వస్తు, సేవల పన్ను) రాబడి తగ్గింది. గత ఎనిమిది నెలలుగా రూ.లక్ష కోట్ల మార్క్‌ పైనే ఉన్న జీఎస్‌టీ వసూళ్లు.. గత నెలలో రూ.92 వేలకోట్లుగా నమోదయ్యాయి. అయితే గతేడాది జూన్‌ నెల వసూళ్లతో పోలిస్తే ఇది 2శాతం ఎక్కువ అని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.

వసూళ్ల లెక్క..

జూన్‌ రూ. 92,849కోట్ల మేర జీఎస్‌టీ వసూలైంది. ఇందులో కేంద్రం వాటా (సీజీఎస్‌టీ) రూ.16,424కోట్లు, రాష్ట్రాల జీఎస్‌టీ(ఎస్‌జీఎస్‌టీ) రూ.20,397 కోట్లుగా నమోదైనట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. సమ్మిళిత జీఎస్‌టీ కింద రూ. 49,079కోట్లు, సెస్‌ రూపంలో రూ. 6,949కోట్లు వసూలైనట్లు ఆర్థికశాఖ తెలిపింది.

కరోనా రెండో దశ ఉద్ధృతి కారణంగా ఈ ఏడాది మే నెలలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్లు, కఠిన ఆంక్షలు తీసుకొచ్చాయి. దీంతో ఆ నెలలో వ్యాపార కార్యకలాపాలు తగ్గాయి. ఏప్రిల్‌లో 5.88కోట్ల ఈ-వే బిల్లులు రాగా.. మే నెలలో వాటి సంఖ్య 3.99కోట్లు మాత్రమే. దీంతో జూన్‌ నెలలో జీఎస్‌టీ వసూళ్లు తగ్గినట్లు ఆర్థికశాఖ పేర్కొంది. అయితే దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల గత నెలలో చాలా రాష్ట్రాల్లో పరిస్థితులు సాధారణానికి వచ్చాయి.

వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల జూన్‌లో 5.5కోట్ల ఈ-వే బిల్లులు జనరేట్‌ అయ్యాయి. దీంతో జులై నెల నుంచి మళ్లీ వసూళ్లు పెరుగుతాయని కేంద్రం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. రూ.1.41లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లతో ఏప్రిల్‌ నెల ఆల్‌టైమ్‌ రికార్డుగా నిలిచింది.

ఇదీ చదవండి:లిమిటెడ్ ఆఫర్​- జీవిత కాల కనిష్ఠానికి హోంలోన్ వడ్డీ రేట్లు!

ABOUT THE AUTHOR

...view details