వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు సెప్టెంబర్‌లోనూ(GST Collection in September) రూ.లక్ష కోట్ల మార్క్ దాటాయి. జీఎస్టీ ద్వారా గత నెల మొత్తం రూ.1,17,010 కోట్ల ఆదాయం గడించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబర్‌తో పోల్చితే ఈ మొత్తం 23 శాతం ఎక్కువని పేర్కొంది.
సెప్టెంబర్‌లోనూ రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు - సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు
జీఎస్టీ (GST Revenue) వసూళ్ల జోరు కొనసాగుతోంది. సెప్టెంబర్‌లోనూ (GST Collection in September) రూ.లక్ష కోట్లపైన నమోదయ్యాయి. 2020 సెప్టెంబర్‌తో పోలిస్తే.. గత నెల జీఎస్టీ ఆదాయం 23 శాతం పెరిగినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.
జీఎస్టీ వసూళ్లు
వసూళ్లు ఇలా..
- కేంద్ర జీఎస్టీ రూ.20,578 కోట్లు
- రాష్ట్రాల జీఎస్టీ రూ.26,767 కోట్లు
- సమీకృత జీఎస్టీ రూ.60,911 కోట్లు
- సెస్ రూ.8,754 కోట్లు