మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. లక్ష కోట్ల దాటాయి. మొత్తంగా రూ.1,02,709 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇందులో సీజీఎస్టీ రూ.17,592 కోట్లు ఉన్నట్లు తెలిపింది. ఎస్జీఎస్టీ రూ.22,653, ఐజీఎస్టీ రూ.53,199 కోట్లు వసులైనట్లు వివరించింది.
తాజా వసూళ్లతో వరుసగా ఎనిమిదో నెలలో లక్ష కోట్ల జీఎస్టీ లభించినట్లైంది. గతేడాది మేతో పోలిస్తే ఈ సారి వసూలైన జీఎస్టీ 65 శాతం అధికమని తెలుస్తోంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈ వసూళ్లు గణనీయంగా తగ్గిపోయినట్లు స్పష్టమవుతోంది. ఏప్రిల్లో రూ.1,41,384 కోట్లు జీఎస్టీ రూపంలో వచ్చాయి. మార్చిలో జీఎస్టీ వసూళ్లు రూ.1.23 లక్షల కోట్లుగా ఉన్నాయి.