ప్రజలపై పన్నుల భారాన్ని.. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం భారీగా తగ్గించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పన్ను చెల్లిపుదారుల పరిధి కూడా దాదాపు రెట్టింపై.. 1.2 కోట్లకు చేరినట్లు తెలిపింది. జీఎస్టీ అమలు తొలినాళ్లలో ఈ సంఖ్య 65 లక్షలుగా మాత్రమే ఉండేదని గుర్తుచేసింది.
మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రథమ వర్ధంతి సందర్భంగా.. జీఎస్టీ అమలులో ఆయన పాత్రను గుర్తు చేసుకుంది ఆర్థిక శాఖ. నరేంద్ర మోదీ 2014లో తొలి సారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు.. అరుణ్ జైట్లీ ఆర్థిక శాఖ మంత్రిగా సేవలందించారు. ఆ సమయంలోనే ఓకే దేశం ఒకే పన్ను నినాదంతో 2017 జులై 1 నుంచి జీఎస్టీని అమలులోకి తెచ్చారు జైట్లీ.