ఆర్థిక సంవత్సరంలో చివరిదైన మార్చిలో జీఎస్టీ వసూళ్లు స్వల్పంగా తగ్గాయి. ఈ నెలకు సంబంధించి జీఎస్టీ రూపంలో రూ.97,597 కోట్ల ఆదాయం గడించింది కేంద్రం. ఫిబ్రవరిలో రూ.1.05 లక్షల కోట్లు వసూలు అయ్యాయి.
మొత్తం వసూళ్లలో కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ) రూపంలో రూ.19,183 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ (ఎస్ జీఎస్టీ)ల ద్వారా రూ.25,601 కోట్లు వచ్చాయి. మిగిలిన రూ.44,508 కోట్లు ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ కింద వసూలు అయినవి. ఇందులో దిగుమతుల ద్వారా రూ.18,056 కోట్లు వచ్చినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.