తెలంగాణ

telangana

By

Published : Jun 10, 2021, 5:55 PM IST

ETV Bharat / business

జీఎస్​టీ తగ్గింపుపై 12న కీలక భేటీ

జీఎస్​టీ మండలి ఈ నెల 12న భేటీ కానుంది. కరోనా చికిత్సకు సంబంధించిన అత్యవసర వస్తువులు, బ్లాక్‌ ఫంగస్‌ ఔషధాలపై పన్నులు తగ్గించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Agenda of GST council meet
జీఎస్​టీ మండలి భేటీ అజెండా

కరోనా చికిత్సకు సంబంధించి అత్యవసర వస్తువులు, బ్లాక్‌ ఫంగస్‌ ఔషధాలపై పన్నుల తగ్గింపుపై చర్చే ప్రధాన అజెండాగా వస్తు, సేవల పన్ను కమిటీ ఈనెల 12న భేటీ కానుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ అధ్యక్షతన శనివారం ఈ సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు.

మే నెలాఖరులో జరిగిన జీఎస్​టీ కౌన్సిల్‌ సమావేశంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ సంఘం (జీఓఎం) నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ నెల 12న భేటీ కావాలని జీఎస్​టీ మండలి నిర్ణయించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ అధ్యక్షతన శనివారం కౌన్సిల్‌ భేటీ కానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమావేశంలో కరోనా చికిత్సకు అత్యవసర వస్తువులు, బ్లాక్‌ ఫంగస్‌ ఔషధాలపై పన్నులు తగ్గించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

గత భేటీలో చర్చాంశాలు..

మే 28న జరిగిన సమావేశంలో జీఎస్​టీ కౌన్సిల్‌ సభ్యులు కరోనాకు చికిత్సకు వాడే సామగ్రి అయిన పీపీఈ కిట్లు, మాస్క్‌లు, వ్యాక్సిన్లు తదితరాలపై పన్ను ఉపశమనం కల్పించాలని కోరారు. ఈ అంశంపై అధ్యయనానికి కేంద్ర ఆర్థిక శాఖ మేఘాలయ ముఖ్యమంత్రి కె.సంగ్మా నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జూన్‌ 7న నివేదిక సమర్పించినట్టు అధికారులు తెలిపారు. ఇందులోని సిఫార్సుల ఆధారంగా ఈనెల 12న జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.

ఇదీ చదవండి:2021-22 వృద్ధి రేటు 8.5 శాతం!

ABOUT THE AUTHOR

...view details