తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈ నెల 12న జీఎస్టీ కౌన్సిల్​ సమావేశం - GST meetings updates

కరోనా సంక్షోభం నేపథ్యంలో పన్ను ఆదాయంపై చర్చించేందుకు త్వరలోనే జీఎస్టీ సమావేశం నిర్వహించనుంది కేంద్రం. ఈ నెల 12 న కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్​.. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశముంది.

Finance Minister Nirmala Seetharaman
ఈ నెల 12న జీఎస్టీ వీడియో కాన్ఫరెన్స్​?

By

Published : Jun 5, 2020, 8:42 PM IST

కరోనా నేపథ్యంలో పన్ను ఆదాయంపై చర్చించేందుకు జీఎస్టీ కౌన్సిల్‌ ఈ నెల 12న సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్‌ 40వ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించే అవకాముంది.

కేంద్ర, రాష్ట్ర ఆదాయాలపై కరోనా ప్రభావం సహా.. నిలిచిపోయిన ఆదాయాన్ని పునరుద్ధరించే మార్గాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

రాష్ట్రాల నష్టాలను భర్తీ చేసేలా

రిటర్న్‌లు దాఖలు చేయడానికి గడువు పొడిగించడం సహా వసూళ్లు తగ్గినందున ఏప్రిల్‌, మే నెలల జీఎస్టీ వసూళ్లను కేంద్రం వెల్లడించలేదు. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు వచ్చే నష్టాలను భర్తీ చేసేలా పరిహారాన్ని చెల్లించే మార్గాలపై కూడా కౌన్సిల్‌ చర్చించనుంది. పరిహారం చెల్లించేందుకు మార్కెట్ నుంచి జీఎస్టీ కౌన్సిల్ రుణాలు తీసుకోవడంపై చట్టబద్ధతను కేంద్రం పరిశీలిస్తుందని గత కౌన్సిల్ సమావేశంలో నిర్మలా సీతారామన్ తెలిపారు.

జీఎస్టీ రిటర్న్​లు దాఖలుపైనా?

అంతేకాకుండా 2017 ఆగస్టు నుంచి 2020 జనవరి వరకు జీఎస్టీ రిటర్న్‌లు దాఖలు చేయనందుకు ఆలస్య రుసుము మాఫీపై కూడా కౌన్సిల్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:దేశంలో ఆన్​లైన్​ వీడియో వీక్షకుల సంఖ్య ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details