వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మండలి సమావేశం జూన్లో జరగనుంది. అత్యవసరం కాని వస్తువులపై జీఎస్టీ పెంపునకు కేంద్ర ఆర్థిక శాఖ సిద్ధంగా లేదని తెలుస్తోంది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఆదాయం తగ్గినా యథాస్థితినే కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కరోనా ప్రభావంతో అత్యవసరం కాని వస్తువుల డిమాండ్ భారీగా పడిపోయింది. వీటిపై జీఎస్టీ విధిస్తే మరింత కుంగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి ఇది ఆటంకమవుతుందని భావిస్తున్నారు.
"లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత అత్యవసర వస్తువులతోపాటు అన్ని రంగాలకు డిమాండ్ పెరిగేలా చూడాలి. అయితే నిర్ణయం తీసుకునేది మండలికి అధ్యక్షత వహించే కేంద్ర ఆర్థిక మంత్రి. వచ్చే నెలలో జరిగే మండలి సమావేశంలో రేట్లకు సంబంధించిన చర్చ జరుగుతుంది. దీనికి రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరవుతారు."
- అధికారిక వర్గాలు