తెలంగాణ

telangana

ETV Bharat / business

రాష్ట్రాలకు కేంద్రం జీఎస్​టీ బకాయిలు రూ.లక్షన్నర కోట్లు

రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్​టీ పరిహారం రూ. 1.51లక్షల కోట్లు అని ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్​ సింగ్​ ఠాకూర్​.. పార్లమెంట్​కు తెలిపారు. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రకు రూ. 22,485కోట్లు చెల్లించాలని స్పష్టం చేశారు.

GST compensation due to states at Rs 1.51 lakh cr, Maharashtra leads
రాష్ట్రాల జీఎస్​టీ పరిహారం రూ. 1.51లక్షల కోట్లు

By

Published : Sep 14, 2020, 5:09 PM IST

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్-ఆగస్టులో జీఎస్​టీ వసూళ్లు క్షీణించాయని.. రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారం లక్షా 51 వేల కోట్ల రూపాయలకు పైగా ఉందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్​టీ పరిహారంపై లోక్‌సభలో వచ్చిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. అత్యధికంగా... 22 వేల 485 కోట్ల రూపాయలను మహారాష్ట్రకు చెల్లించనున్నారు. 13 వేల 763 కోట్ల రూపాయలను కర్ణాటకకు ముట్టజెప్పనున్నారు.

కేంద్రం నుంచి పరిహారం తీసుకునే రాష్ట్రాల జాబితాలో ఉత్తర్​ప్రదేశ్, గుజరాత్, తమిళనాడు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. పెండింగ్‌లో ఉన్న పరిహారం, భవిష్యత్ చర్యల గురించి ఆగస్టు 27న జరిగిన 41వ జీఎస్​టీ మండలి సమావేశంలో చర్చించామన్న ఠాకూర్..‌ 2020-21 ఆర్థిక సంవత్సరానికి మార్కెట్ రుణాలు తీసుకోవడం, జీఎస్​టీ పరిహార కొరతను తీర్చడానికి రాష్ట్రాలకు 2ఎంపికలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు 2 లక్షల 35 వేల కోట్ల రూపాయల జీఎస్​టీ ఆదాయ కొరతను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో 2020-21 సంవత్సరానికి కేంద్రానికి మొత్తం నికర జీఎస్​టీ లక్ష్యాన్ని 6 లక్షల 90 వేల 500 కోట్ల రూపాయలుగా నిర్ణయించినట్లు ప్రత్యేక ప్రశ్నకు... కేంద్రమంత్రి సమాధానమిచ్చారు.

ఇదీ చూడండి:-ఆగస్టులో వెయ్యి కోట్లు తగ్గిన జీఎస్​టీ వసూళ్లు

తగ్గిన ఎఫ్​డీఐలు...

గత మూడేళ్లుగా చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గాయని లోక్​సభకు తెలియజేశారు అనురాగ్​ ఠాకూర్​. 2019-20లో 163.77 మిలియన్​ డాలర్లు ఎఫ్​డీఐ రూపంలో అందినట్టు పేర్కొన్నారు. 2017-18లో ఆ సంఖ్య 350.22 మిలియన్లని, ఆ తర్వాతి ఏడాదిలో 229మిలియన్​ డాలర్ల ఎఫ్​డీఐ నమోదైందని స్పష్టం చేశారు.

2020లో భారత్​ నుంచి 20.63మిలియన్​ డాలర్లు విదేశాలకు వెళ్లినట్టు అనురాగ్​ వెల్లడించారు. గతేడాది ఆ సంఖ్య 27.57 మిలియన్​ డాలర్లుగా ఉందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:-అసలా.. వడ్డీయా..? రెండు ఐచ్ఛికాలపై కేంద్రం స్పష్టత

ABOUT THE AUTHOR

...view details