దేశవ్యాప్తంగా లాక్డౌన్ సడలింపులతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. ఫలితంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు జూన్లో రూ.90,917 కోట్లకు పెరిగాయి. అంతకు ముందు లాక్డౌన్ కారణంగా మేలో రూ.62,009 కోట్లు, ఏప్రిల్లో అత్యల్పంగా రూ.32,294 కోట్ల పన్నులు మాత్రమే వసూలయ్యాయి.
మళ్లీ రూ.90 వేల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు - పెరిగిన జీఎస్టీ వసూళ్లు
జీఎస్టీ వసూళ్లు జూన్లో భారీగా పెరిగాయి. లాక్డౌన్ సడలింపులతో పన్ను వసూళ్లు తిరిగి రూ.90 వేల కోట్లు దాటాయి. గత నెల పన్నుల వసూళ్లకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాలు ఇలా ఉన్నాయి.
జూన్లో పెరిగిన జీఎస్టీ వసూళ్లు
జూన్ జీఎస్టీ లెక్కలు..
- కేంద్ర జీఎస్టీ - రూ.18,980 కోట్లు
- రాష్ట్రాల జీఎస్టీ -రూ.23,970 కోట్లు
- సమీకృత జీఎస్టీ -రూ.40,302 కోట్లు
- సెస్- రూ.7,665 కోట్లు
ఇదీ చూడండి:విమాన సంస్థలకు షాక్.. ఏటీఎఫ్ ధరలు పైపైకి