జీఎస్టీ వసూళ్లు వరుసగా ఐదో నెలలోనూ లక్ష కోట్ల మార్కును దాటాయి. ఫిబ్రవరిలో రూ.1.13 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గతేడాది ఫిబ్రవరితో పోల్చితే.. ఇది 7 శాతం అధికమని పేర్కొంది. అయితే.. జనవరిలో వసూళ్లు రూ.1.20 లక్షల కోట్లకన్నా ఇది తక్కువేనని తెలిపింది.
ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్ల లెక్కలివీ..
- కేంద్ర జీఎస్టీ - రూ.21,092 కోట్లు
- రాష్ట్రాల జీఎస్టీ -రూ.27,273 కోట్లు
- సమీకృత జీఎస్టీ -రూ.55,253 కోట్లు
- సెస్- రూ.9,525 కోట్లు