తెలంగాణ

telangana

ETV Bharat / business

మళ్లీ లక్ష కోట్ల దిగువకు జీఎస్​టీ వసూళ్లు - జీఎస్​టీ వసూళ్లు

జులైతో పోల్చితే వస్తు సేవల పన్ను(జీఎస్​టీ) వసూళ్లు.. ఆగస్టులో స్వల్పంగా తగ్గాయి. లక్ష కోట్ల దిగువకు చేరాయి. రూ. 98 వేల 202 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు.. ప్రభుత్వ గణాంకాల్లో స్పష్టమైంది.

మళ్లీ లక్ష కోట్ల దిగువకు జీఎస్​టీ వసూళ్లు

By

Published : Sep 1, 2019, 5:47 PM IST

Updated : Sep 29, 2019, 2:08 AM IST

ఆగస్టులో వస్తు సేవల పన్ను(జీఎస్​టీ) వసూళ్లు రూ. 98 వేల 202 కోట్లుగా నమోదైనట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేశాయి. గతేడాది ఇదే నెలలో వసూలైన.. 93 వేల 960 కోట్ల రూపాయలతో పోల్చితే ప్రస్తుతం 4.5 శాతం మేర పెరిగినట్లు ప్రకటించింది.

జులై నెలలో జీఎస్​టీ స్థూల ఆదాయం.. రూ. లక్షా 2 వేల కోట్లుగా నమోదైంది.

ఈ ఏడాదిలో జీఎస్​టీ వసూళ్లు.. లక్ష కోట్ల దిగువకు చేరడం ఇది రెండోసారి. జూన్​లోనూ రూ. 99 వేల 939 కోట్లు జీఎస్​టీ ద్వారా వచ్చాయి.

ఆగస్టులో జీఎస్​టీ వసూళ్ల లెక్కలు

  • కేంద్ర జీఎస్​టీ- రూ.17,733 కోట్లు
  • రాష్ట్రాల జీఎస్​టీ- రూ. 24,239 కోట్లు
  • సమీకృత​ జీఎస్​టీ- రూ.48,958 కోట్లు
Last Updated : Sep 29, 2019, 2:08 AM IST

ABOUT THE AUTHOR

...view details