వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు వరుసగా నాలుగోసారి (GST Collection in october) రూ.లక్ష కోట్ల మార్క్ దాటాయి. జీఎస్టీ ద్వారా అక్టోబరులో మొత్తం రూ.1,30,127 కోట్ల ఆదాయం గడించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం ప్రకటించింది.
జీఎస్టీ అమల్లోకి వచ్చాక 2021 ఏప్రిల్లో మొదటిసారి రికార్డు స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ఏప్రిల్లో వసూళ్లు రూ. 1,41,384 కోట్లు వచ్చాయి. ఇప్పుడు రెండోసారి ఆ స్థాయిలో వసూళ్లు వచ్చినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
అక్టోబరులో జీఎస్టీ వసూళ్లు ఇలా..
- కేంద్ర జీఎస్టీ రూ.23,861 కోట్లు
- రాష్ట్రాల జీఎస్టీ రూ.30,421 కోట్లు
- సమీకృత జీఎస్టీ రూ.67,361 కోట్లు
- సెస్ రూ.8,484 కోట్లు