తెలంగాణ

telangana

By

Published : Mar 1, 2019, 1:08 PM IST

ETV Bharat / business

రెండేళ్లు 7.3 శాతమే!

భారత ఆర్థిక వృద్ధి 2019, 2020 సాధారణ వార్షిక సంవత్సరాల్లో 7.3 శాతంగా ఉండొచ్చని రేటింగ్​ ఏజెన్సీ 'మూడీస్'​ అంచనా వేసింది.

మూడీస్

భారత ఆర్థిక వృద్ధి 2019, 2020 సాధారణ వార్షిక సంవత్సరాల్లో 7.3 శాతంగా ఉండొచ్చని అమెరికా కేంద్రంగా పని చేస్తోన్న రేటింగ్​ ఏజన్సీ మూడీస్​ అంచనా వేసింది.

ఇతర ఆసియా దేశాలతో పోల్చుకుంటే వర్తక వృద్ధిలో మందగమనం కారణంగా ఈ రెండేళ్లు దేశ ఆర్థిక వృద్ధి దాదాపు స్థిరంగా ఉంటుందని మూడీస్​ 2019-2020 ప్రపంచ త్రైమాసిక ముఖ చిత్రంలో పేర్కొంది.

కేంద్ర గణాంకాల కార్యాలయం ఇటీవల వెల్లడించిన లెక్కల ప్రకారం 2019 మార్చితో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనా 7 శాతంగా ఉంది. ఇది 2017-18 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 0.2 శాతం తక్కువ.

కేంద్రం ప్రవేశపెట్టిన 2019-20 ఆర్థిక సంవత్సర మధ్యంతర బడ్జెట్​లో ప్రకటించిన రైతులకు నగదు బదిలీ పథకం, మధ్యతరగతి వర్గాలకు పన్ను మినహాయింపులు, జీడీపీ వృద్ధికి 0.45 శాతం మేర ప్రోత్సాహకాన్ని అందించవచ్చని మూడీస్​ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details