ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(జూన్ 15 నాటికి)లో స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 31 శాతం తగ్గాయి. ఇదే సమయానికి కార్పొరేట్ల అడ్వాన్స్ ట్యాక్స్‌లు ఏకంగా 79 శాతం తగ్గినట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. అడ్వాన్స్ ట్యాక్స్‌ల చెల్లింపునకు జూన్ 15నే గడువు ముగిసినట్లు వెల్లడించింది.
వసూళ్లు లెక్కలు..
జూన్ 15 నాటికి ప్రత్యక్ష స్థూల పన్నుల వసూళ్లు రూ.1,37,825 కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయానికి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.1,99,755 కోట్లుగా ఉండటం గమనార్హం.