కరోనా విజృంభణతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఫలితంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఆగస్టులో భారీగా తగ్గాయి. ఈ ఏడాది జులైలో రూ.87,422 కోట్లుగా ఉన్న వసూళ్లు.. ఆగస్టులో రూ.86,449కు చేరాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
- సీజీఎస్టీ రూ. 15,906 కోట్లు,
- ఎస్జీఎస్టీ రూ. 21,064 కోట్లు
- ఐజీఎస్టీ వసూలు రూ. 42,264 కోట్లు
- సెస్ రూ. 7,215 కోట్లు
గతేడాదితో పోలిస్తే..
- 2019 ఆగస్టులో జీఎస్టీ రూ. 98,202 కోట్లు వసూలైంది. అంటే, ప్రస్తుతం రూ.11,753 కోట్ల ఆదాయం తగ్గింది. గతేడాదితో పోలిస్తే 2020 ఆగస్టులో 88.03 శాతమే జీఎస్టీ వసూళ్లు జరిగాయి.
- 2019 జులైలో రూ.90,917 కోట్ల వసూలయ్యాయి. దీనితో పోలిస్తే ఈ ఏడాదిలో జులైలో14.36 శాతం వసూళ్లు తగ్గాయి.
- 2019 ఏప్రిల్-జూన్‌తో పోలిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీఎస్టీ సేకరణ 59% మాత్రమే.