'గ్రామాలు, పేదలు,అన్నదాత'ను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఏ పనైనా చేస్తుందని 2019 బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. 2022 కల్లా అన్నదాతల ఆదాయం రెండింతలు చేసే ప్రక్రియలో భాగంగా వ్యవసాయం, సంబంధిత రంగాల్లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు.
"వ్యవసాయంలోని మౌలిక వసతులపై ఎక్కువ పెట్టుబడులు పెడతాం. రైతుల ఉత్పత్తుల విలువలను పెంచేందుకు ప్రైవేటు పారిశ్రామికవేత్తలకు సహాయం చేస్తాం. వెదురు, కలప సహా పునరుత్పాదక శక్తి ఉత్పత్తి పెంచేలా కృషి చేస్తాం. అన్నదాత ఎందుకు 'శక్తి'దాత కాలేడు?"
--- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికమంత్రి.
కొత్తగా 10 వేల రైతు ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేసి కర్షకులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు నిర్మల. ఆ సంస్థలు రానున్న ఐదేళ్లలో అన్నదాతలకు ఎంతో ఉపయోగపడతాయని ధీమా వ్యక్తం చేశారు.