తెలంగాణ

telangana

ETV Bharat / business

వడ్డీ మాఫీ ప్రభావం అంచనాకు నిపుణుల కమిటీ - మారటోరియంలో వడ్డీ మాఫీపై సుప్రీం తీర్పు

మారటోరియం సమయంలో వడ్డీ మాఫీ ప్రభావాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీకి మాజీ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రాజీవ్ మహర్షీ నేతృత్వం వహించనున్నట్లు తెలిపింది.

Center panel for interest waiver assessment
వడ్డీ మాఫీ సమస్య పరిష్కారానికి కేంద్రం ప్యానెల్

By

Published : Sep 11, 2020, 4:57 AM IST

Updated : Sep 11, 2020, 8:42 AM IST

కరోనా నేపథ్యంలో ఆర్​బీఐ విధించిన మారటోరియం సమయంలో వడ్డీ మాఫీ భారాన్ని అంచనా వేసేందుకు కేంద్రం నిపుణుల కమిటీని నియమించింది. మాజీ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రాజీవ్ మహర్షి ఈ ప్యానెల్​కు నేతృత్వం వహించనున్నట్లు తెలిపింది.

ఆర్‌బీఐ మానిటరీ పాలసీ మాజీ సభ్యుడు రవీంద్ర హెచ్.ధోలాకియా, ఎస్‌బీఐ మాజీ మేనేజింగ్ డైరెక్టర్​ శ్రీరామ్​లు కమిటీలో సభ్యులుగా ఉంటారని కేంద్రం వెల్లడించింది.

మారటోరియంలో రుణాలపై వడ్డీపై వడ్డీ మాఫీ భారం, ఆర్థిక వ్యవస్థ మీద, ఆర్థిక స్థిరత్వం మీద దీని ప్రభావాన్ని అంచనా వేయడం కమిటీ ముఖ్య ఉద్దేశం.

మారటోరియం సమయంలో వడ్డీ వసూలును సవాలు చేస్తూ దిల్లీకి చెందిన గజేంద్రశర్మ.. దాఖలు చేసిన పిటిషన్​పై​ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం రెండు వారాల్లోగా ఈ విషయంపై స్పష్టతనివ్వాలని గురువారం కేంద్రానికి స్పష్టం చేసింది. మళ్లీ వాయిదాలు ఉండబోవని తెల్చి చెప్పింది. ఈ సమస్యపై అంచనాకోసం ఓ ప్యానెల్​ను ఏర్పాటు చేసినట్లు సుప్రీంకు తెలిపిన కేంద్రం.. ఆ తర్వాత కమిటీ వివరాలు వెల్లడించింది.

ఇదిలా ఉండగా తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు.. రుణగ్రహీత ఖాతాలను నిరర్ధక ఆస్తులుగా ప్రకటించకూడదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:'రుణ గ్రహీతలకు సుప్రీం మరింత ఉపశమనం'

Last Updated : Sep 11, 2020, 8:42 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details