పెట్రోల్, డీజిల్.. జీఎస్టీ (వస్తు,సేవల పన్ను) కిందకు వస్తాయా అనే సందేహానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బదులిచ్చారు. పెట్రోల్, డీజిల్ ఇప్పటికే జీఎస్టీ పరిధిలో జీరో రేట్ కేటగిరీలో ఉన్నాయని నిర్మలా స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రులు సభ్యులుగా... కేంద్ర విత్త మంత్రి అధ్యక్షతన ఏర్పాటైన జీఎస్టీ మండలి వాటి ధరలను నిర్ణయిస్తుందన్నారు.
'పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం పన్నులు తగ్గిస్తుందా?' - పెట్రోల్‌పై పన్ను విధింపుపై కేంద్రం వివరణ
పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించే ప్రతిపాదనలు ప్రస్తుతం ఏం లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పెట్రో ధరల నియంత్రణ సహా పన్ను రాయితీ వంటి విషయాలపై లోక్‌సభ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బదులిచ్చారు.
'పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించే ప్రతిపాదనలు లేవు'
పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించడం ద్వారా ధరలను నియంత్రిస్తారా అన్న ప్రశ్నకు ఆర్థిక మంత్రి బదులిస్తూ.. అలాంటి ప్రతిపాదనలు ప్రస్తుతం ఏం లేవన్నారు. పెట్రోల్, డీజిల్‌పై కొత్తగా ఏ విధమైనా పన్నులు విధించే యోచన లేదని స్పష్టం చేశారు.
ప్రపంచంలో ఎక్కడా నిర్దిష్ట కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండవని నిర్మలా వెల్లడించారు.
- ఇదీ చూడండి: నేటి అర్ధరాత్రి నుంచే 'మొబైల్ ఛార్జీ'ల మోత