తెలంగాణ

telangana

సర్జికల్​ మాస్క్​ల ఎగుమతిపై​ నిషేధం ఎత్తివేత

కరోనా వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సర్జికల్​ మాస్క్​ల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో మాస్క్​లు సహా గ్లవ్​లను.. ఎగుమతుల నిషేధిత వస్తువుల జాబితా నుంచి తొలగిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

By

Published : Feb 9, 2020, 5:30 PM IST

Published : Feb 9, 2020, 5:30 PM IST

Updated : Feb 29, 2020, 6:45 PM IST

carona
సర్జికల్​ మాస్క్​ల ఎగుమతిపై​ నిషేధం ఎత్తివేత

ఎగుమతుల నిషేధిత వస్తువుల జాబితా నుంచి సర్జికల్​ మాస్క్​లు, గ్లవ్​లను తొలగించింది భారత ప్రభుత్వం. చైనాలో కరోనా వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో.. గాలి ద్వారా వ్యాప్తి చెందే ఈ రోగానికి అడ్డుకట్ట వేసేందుకు గత నెలలోనే అన్ని రకాల వ్యక్తిగత రక్షణ సాధనాలైన మాస్క్​లు, దుస్తులపై ప్రభుత్వం నిషేధం విధించింది.

కరోనా వైరస్ ఇప్పటికే 800 మందికి పైగా పొట్టనబెట్టుకుని.. మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో మాస్క్​లకు డిమాండ్​ పెరిగే అవకాశముంది. ఈ సమయాల్లో భారత్​ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

సర్జికల్ మాస్క్​లు, డిస్పోజల్​ మాస్క్​లు అన్ని రకాల గ్లవ్​లను (ఎన్​బీఆర్​ గ్లవ్​లు మినహా) ఎగుమతి చేసేందుకు అనుమతిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్​ నోటిఫికేషన్​ విడుదల చేసింది.

అయితే వీటికి మినహాయింపు ఇచ్చినప్పటికీ పలు వ్యక్తిగత రక్షణ సాధనాలైన ఎన్​-95 సహా ఇతర వస్తువుల ఎగుమతిపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:త్వరలో రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారంగా రూ.35,000 కోట్లు!

Last Updated : Feb 29, 2020, 6:45 PM IST

ABOUT THE AUTHOR

...view details