తెలంగాణ

telangana

ETV Bharat / business

రెండేళ్లలో మారుమూల గ్రామాలకూ బ్రాడ్​బ్యాండ్​ సేవలు!

దేశంలో సమాచార వ్యవస్థను మరింత వృద్ధి చేసేందుకు కేంద్రం మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా 'జాతీయ బ్రాడ్​ బ్యాండ్​ మిషన్​'ను ఇటీవల ప్రారంభించింది. 2022 కల్లా దేశంలోని అన్ని మారుమూల గ్రామాలకూ అంతర్జాల సేవలందించడమే దీని ప్రధాన లక్ష్యంగా పేర్కొంది ప్రభుత్వం.

BROADBAND
రెండేళ్లలో మారుమూల గ్రామాలకూ బ్రాడ్​ బ్యాండ్​ సేవలు!

By

Published : Dec 18, 2019, 9:14 AM IST

దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి 2022 కల్లా నాణ్యమైన బ్రాడ్​బ్యాండ్‌ సౌకర్యం అందుబాటులోకి తేనున్నట్లు కేంద్రం వాగ్దానం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ దిల్లీలో ఇటీవల 'జాతీయ బ్రాడ్​బ్యాండ్‌ మిషన్‌'ను ప్రారంభించారు. మనదేశంలో డిజిటల్‌ వ్యవస్థను మరింత వృద్ధి చేసేందుకు వీలుగా సమాచార వ్యవస్థ మౌలిక వసతులను త్వరితగతిన అభివృద్ధి చేయడం దీని లక్ష్యాల్లో ఒకటి. భారత్‌ను 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చూడాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కల సాకారమయ్యేందుకు ఈ మిషన్‌ సాధనంగా ఉపయోగపడుతుందని రవిశంకర్‌ అభిప్రాయపడ్డారు.

మిషన్‌ లక్ష్యాలు..

  • దేశవ్యాప్తంగా 30 లక్షల కిలోమీటర్ల పొడవున ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్ల ఏర్పాటు.
  • ప్రస్తుతం ప్రతి వెయ్యిమంది జనాభాకు 0.42గా ఉన్న టవర్ల సాంద్రతను 2024 కల్లా ఒకటికి పెంచడం.
  • మొబైల్‌, అంతర్జాల సేవల నాణ్యతను గుణాత్మకంగా మెరుగుపరచడం.
  • దేశవ్యాప్తంగా ఆప్టికల్‌ ఫైబర్‌, టవర్‌ నెట్‌వర్క్‌ను గుర్తిస్తూ డిజిటల్‌ ఫైబర్‌ మ్యాప్‌ను రూపొందించడం.
  • భాగస్వామ్య సంస్థల ద్వారా రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడం.

ఇదీ చూడండి:స్వయం కృషీవలురు ఈ యువ శ్రీమంతులు

ABOUT THE AUTHOR

...view details