2020 రెండో త్రైమాసికంలో ప్రభుత్వ అప్పులు 5.6శాతం పెరిగినట్లు కేంద్రం నివేదిక విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి ఈ మొత్తం రూ. 107.04 లక్షల కోట్లకు చేరినట్లు పేర్కొంది. క్యూ1లో వీటి విలువ రూ. 101.3 లక్షల కోట్లుగా నమోదు కాగా.. తాజా లెక్కలతో మరింత పెరిగినట్లు తెలిపింది.
కొవిడ్ నేపథ్యంలో రాబడిపై ఒత్తిడి పెరగడం వల్ల అప్పులు భారం అధికం అయినట్లు నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ రుణ నిర్వహణ తాజా నివేదిక ప్రకారం.. 2020 సెప్టెంబరు చివరి నాటికి మొత్తం అప్పుల్లో 91.1 శాతం ప్రజా రుణం పేరుకుపోయినట్లు తెలిపింది.