ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన-కీలకాంశాలు:
- కరోనా సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలిచేందుకు కేంద్రం కీలక నిర్ణయం.
- ప్రధాన మంత్రి పేదల సంక్షేమ పథకం పేరిట లక్షా 70 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటన.
- కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, పారామెడిక్స్, వైద్య సిబ్బంది ఒక్కొక్కరికి రూ.50 లక్షల బీమా.
- రానున్న 3 నెలల పాటు దేశంలోని 80 కోట్ల మందికి ప్రతినెలా ఉచితంగా 5 కిలోల బియ్యం/గోధుమలు, కిలో పప్పుధాన్యాలు అందజేత.
- ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద ప్రతి రైతుకు ఏప్రిల్ మొదటి వారంలో రూ.2వేలు చెల్లింపు. ఈ నిర్ణయంతో దేశంలోని 8.69కోట్ల మంది రైతులకు లబ్ధి.
- గ్రామీణ ఉపాధి హామీ పథకం రోజువారీ కూలీ రూ.182 నుంచి రూ.202కు పెంపు. ఈ నిర్ణయంతో 5 కోట్ల కుటుంబాలకు లబ్ధి.
- పేద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రూ.1000 ఆర్థిక సాయం. ఈ నిర్ణయంతో 3 కోట్ల మందికి లబ్ధి.
- జన్‌ధన్ ఖాతాలున్న 20 కోట్ల మంది మహిళలకు రానున్న 3 నెలలపాటు ప్రతి నెలా గృహావసరాల కోసం రూ.500 అందజేత.
- ఉజ్వల యోజన కనెక్షన్ ఉన్నవారికి రానున్న 3 నెలలపాటు ఉచితంగా వంట గ్యాస్ అందజేత. ఈ నిర్ణయంతో 8.3కోట్ల నిరుపేద కుటుంబాలకు లబ్ధి.
- 63 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలకు పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణం విలువ రూ.20లక్షలకు పెంపు. ఈ నిర్ణయంతో 7 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం.
- రానున్న 3 నెలలకు పీఎఫ్‌కు సంబంధించి ఉద్యోగి, యాజమాన్యం వాటాను చెల్లించనున్న ప్రభుత్వం. మొత్తం ఉద్యోగుల్లో 90శాతం మంది రూ.15 వేలు వేతనం అందుకునేవారు ఉండే సంస్థలకు మాత్రమే ఈ నిర్ణయం వర్తింపు.
- ప్రధాన మంత్రి పేదల సంక్షేమ పథకం తక్షణమే అమలు. ఏప్రిల్ 1 నుంచి నగదు బదిలీ.