తెలంగాణ

telangana

ETV Bharat / business

పొదుపు పథకాల వడ్డీ రేట్లలో నో ఛేంజ్

చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఉన్న వడ్డీ రేట్లే.. క్యూ2కు వర్తిస్తాయని తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.

By

Published : Jul 1, 2021, 5:01 PM IST

Updated : Jul 1, 2021, 6:10 PM IST

Govt keeps small savings interest rates unchanged, check details
యథాతథంగానే పొదుపు పథకాల వడ్డీ రేట్లు

దేశంలోని సామాన్య, మధ్య తరగతికి ఊరట కలిగించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు తెలిపింది. 2021 జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటివరకు కొనసాగిన రేట్లే.. రెండో త్రైమాసికానికీ వర్తిస్తాయని వివరించింది.

2021-22 ఆర్థిక సంవత్సరానికి డిపాజిట్ల వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఈ ఏడాది ఏప్రిల్​కు ముందు కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, 12 గంటలు గడవకుండానే ఆ నోటిఫికేషన్​ను వెనక్కి తీసుకుంది. 2020-21 నాలుగో త్రైమాసికంలో ఉన్న వడ్డీ రేట్లనే ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1కు కొనసాగించింది. తాజాగా వాటినే క్యూ2కూ వర్తింపజేయనున్నట్లు స్పష్టం చేసింది.

చిన్న మొత్తాల పథకాలపై వడ్డీ రేట్లు ఇలా...

వడ్డీ రేట్లు ఇవే..

ఇవీ చదవండి:

Last Updated : Jul 1, 2021, 6:10 PM IST

ABOUT THE AUTHOR

...view details