ఆదాయపు రిటర్నులు దాఖలు చేసే వారికి శుభవార్త. ఆదాయపు పన్ను రిటర్నుల సమర్పణ గడువు తేదీని 2019, జులై 31 నుంచి 2019, ఆగస్టు 31 వరకూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పెంచింది. వివిధ కేటగిరీలకు చెందిన పన్ను చెల్లింపుదారులు ఆ తేదీలోగా రిటర్నులను సమర్పించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఐటీ రిటర్నుల దాఖలు గడువు పెంపు - ఆదాయపు
2018-19 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి గడువు తేదీని ప్రభుత్వం ఆగస్టు 31వ తేదీ వరకూ పొడిగించింది. సాధారణంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి చివరి తేదీ జులై 31. ఇప్పుడు ఆ గడువు మరో నెలరోజులు పెంచింది.
ఐటీ రిటర్నుల దాఖలు గడువు పెంపు
ఐటీఆర్ సమర్పణ గడువు తేదీని పెంచాలని వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
- ఇదీ చూడండి: 'ఉల్లంఘన' కేసులో అనిల్ అంబానీకి ఊరట