ఎల్టీసీ క్యాష్ ఓచర్ పథకానికి సంబంధించి ఉద్యోగుల్లో నెలకొన్న మరిన్ని సందేహాలకు సమాధానమిచ్చింది కేంద్ర ఆర్థిక శాఖ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీవిత భాగస్వామి సహా ఎల్టీసీ ఫేర్‌కు అర్హత ఉన్న ఇతర కుటుంబ సభ్యుల పేరిట వస్తు, సేవల కొనుగోలు జరిపి క్యాష్ ఓచర్‌ను క్లెయిమ్ చేసుకునే వీలుందని వెల్లడించింది.
ఎల్టీసీ క్యాష్ ఓచర్‌పై కేంద్రం మరింత స్పష్టత - ఎల్టీసీ క్యాష్ ఓచర్ పూర్తి వివరాలు
కరోనా సంక్షోభం నేపథ్యంలో వినియోగం పెంచేందుకు ప్రకటించిన ఎల్టీసీ క్యాష్ ఓచర్ పథకంపై నెలకొన్న సందేహాలకు కేంద్రం సమాధానం ఇచ్చింది. ఉద్యోగి జీవిత భాగస్వామి, ఇతర కుటుంబ సభ్యుల పేరిట జరిపే కొనుగోళ్లకు ఈ పథకం వర్తిస్తుందా లేదా అన్నదానికి స్పష్టమైన వివరణ ఇచ్చింది.
క్యాష్ ఓచర్ పథకంపై కేంద్రం మరింత క్లారిటీ
అయితే అక్టోబర్ 12 తర్వాతి నుంచి వచ్చే ఏడాది మర్చి 31లోపు జరిపిన కొనుగోళ్లకు మత్రమే ఈ పథకం వర్తిస్తుందని మరోసారి స్పష్టం చేసింది ఆర్థికశాఖ పరిధిలోని వ్యయాల విభాగం. అక్టోబర్ 12 తర్వాత ఈఎంఐ సదుపాయంతో జరిపిన కొనుగోళ్లకూ ఈ పథకం వర్తిస్తుందని తాజా వివరణలో పేర్కొంది . ఇందుకు జీఎస్టీ ఇన్వాయిస్ కూడా అవసరమవుతుందని తెలిపింది.
ఇవీ చూడండి: