తెలంగాణ

telangana

ETV Bharat / business

12వేల మెట్రిక్​ టన్నుల ఉల్లి దిగుమతికి కేంద్రం ఒప్పందం - The Centre on Thursday said it has contracted to import an additional 12,660 tonnes of onions

ఉల్లికొరత తీర్చే దిశగా మరో అడుగు వేసింది కేంద్రం. 12,660 మెట్రిక్ టన్నులను దిగుమతి చేసుకునేందుకు విదేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సరుకు ఈ నెల 27న భారత మార్కెట్లకు చేరుకుంటుందని ప్రకటన విడుదల చేసింది కేంద్రం.

onion
ఉల్లి దిగుమతికి కేంద్రం ఒప్పందం

By

Published : Dec 12, 2019, 9:38 PM IST

దేశంలో నెలకొన్న ఉల్లి కొరత నివారించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విదేశాల నుంచి మరో 12, 660 మెట్రిక్ టన్నుల దిగుమతికి ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ నెల 27న విదేశాల నుంచి వచ్చే ఉల్లి మార్కెట్లోకి చేరనుంది. ఇప్పటికే 30వేల టన్నులను దిగుమతి చేసుకుంది భారత్. వరుసగా రెండోవారంలోనూ ఉల్లిధరలు రూ. 100కు పైగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు అదనపు దిగుమతికి మొగ్గుచూపింది సర్కారు.

ABOUT THE AUTHOR

...view details