తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర - పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం,వెండి ధరలు పెరిగాయి. దిల్లీలో 10గ్రాముల పుత్తడి ధర బుధవారం స్వల్పంగా రూ.45 పెరిగింది. కేజీ వెండి ధర రూ.407 పెరిగింది.

Gold rises by Rs 45; silver gains Rs 407
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

By

Published : Nov 25, 2020, 4:15 PM IST

బంగారం ధర బుధవారం కాస్త పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి ధర రూ.45 పెరిగి 48,273 వద్దకు చేరింది.

వెండి ధర కిలోకు రూ.407 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.59,380గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు బంగారం ధర 1,812 డాలర్లకు పెరిగింది. వెండి ధర సైతం పెరిగి ఔన్సుకు 23.34 డాలర్ల వద్ద ఉంది.

కరోనా వ్యాక్సిన్​ సత్ఫలితాలు , జో బైడెన్​ శ్వేత సౌధంలోకి అడుగుపెట్టేందుకు మార్గం సుగమం తదితర అంశాలతో పసిడి రేట్లు పెరిగినట్లు హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ సీనియర్​ అనలిస్ట్​ తపన్​ పటేల్ తెలిపారు.

ఇదీ చదవండి :'గూగుల్​ పే' యూజర్లకు గుడ్​న్యూస్

ABOUT THE AUTHOR

...view details