కరోనా వల్ల చాలా మంది ఆదాయాలు తగ్గాయి.. ఇదే సమయంలో ఆర్థిక అవసరాలు పెరిగాయి. దీనితో వారంతా రుణాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రుణాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. బంగారం తనఖా పెట్టి తీసుకునేవి. పర్సనల్ లోన్. మిగతా రుణాలతో పోల్చితే వీటిని పొందటం కాస్త సులువు. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువ.
మరి బంగారం తనఖా పెట్టి తీసుకునే రుణాలు, పర్సనల్ లోన్స్.. వేటి ద్వారా అప్పు తీసుకునే వారికి ప్రయోజనం? వేటిలో వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి? అనే విషయాలతో పాటు ఈ రెండు రకాల రుణ సదుపాయాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
బంగారంపై రుణాలు
- మంజూరు, చెల్లింపు చాలా సులభంగా అవుతుంది.
- ఇది సెక్యూర్డ్ రుణం కాబట్టి క్రెడిట్ హిస్టరీ అవసరం లేదు.
- రిపేమెంట్కు సంబంధించి ఎక్కువ ఆప్షన్లు ఉంటాయి.
- తనాఖా పెడుతున్న బంగారంలో 90 శాతం వరకు రుణంగా పొందవచ్చు.
- రుణ ఈఎంఐ చెల్లించనట్లయితే బ్యాంకులు/రుణ సంస్థలకు తనఖా పెపట్టిన బంగారాన్ని విక్రయించుకునే అధికారాలు ఉంటాయి.
- వడ్డీ రేట్లు 9.50 శాతం నుంచి 29 శాతం వరకు ఉంటాయి.
- సాధారణంగా ప్రాసెసింగ్ సమయం 24-48 గంటలుగా ఉంటుంది.
- ఈ రుణాలకు తిరిగి చెల్లించే వ్యవధి తక్కువగా ఉంటుంది.