తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రథమార్ధంలో పసిడి దిగుమతులు 57శాతం డౌన్ - India trade Deficit

బంగారం దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 57 శాతం తగ్గాయి. దీనితో ఇదే కాలానికి దేశ వాణిజ్య లోటు కూడా (2019-20 మొదటి ఆరు నెలలతో పోలిస్తే) 88.92 బిలియన్ డాలర్ల నుంచి 23.44 బిలియన్​ డాలర్లకు దిగొచ్చినట్లు వాణిజ్య శాఖ తెలిపింది.

gold imports down in first half of this fy
భారీగా పడిపోయిన బంగారం దిగుమతులు

By

Published : Oct 18, 2020, 12:32 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో బంగారం దిగుమతులు భారీగా పడిపోయాయి. 57శాతం తగ్గి.. రూ.50,658 కోట్లుగా నమోదైనట్లు వాణిజ్యశాఖ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో పసిడి దిగుమతుల విలువ రూ.1,10,259 కోట్లుగా ఉంది.

కరోనాతో ఏర్పడిన డిమాండ్ లేమి వల్ల పసిడి దిగుమతులు భారీగా పడిపోయినట్లు వాణిజ్య శాఖ పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య వెండి దిగుమతులు కూడా 63.4 శాతం తగ్గి.. రూ.5,543 కోట్లుగా నమోదైనట్లు వివరించింది.

వాణిజ్య లోటు తగ్గింది..

పసిడి దిగుమతుల్లో నమోదైన ఈ క్షీణత.. దేశ వాణిజ్యలోటును 2020-21 మొదటి ఆరు నెలల్లో 23.44 బిలియన్ డాలర్లకు తగ్గించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో దేశ వాణిజ్య లోటు 88.92 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వాణిజ్య శాఖ గణాంకాల్లో తేలింది.

పసిడికి భారత్ అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. వార్షిక ప్రాతిపదికన మన దేశం 800-900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు కూడా 55శాతం తగ్గి.. 8.7 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి:పేటీఎం షాక్‌: వ్యాలెట్​లోకి నగదు బదిలీపై 2% ఛార్జీ!

ABOUT THE AUTHOR

...view details