తెలంగాణ

telangana

ETV Bharat / business

తగ్గిన పసిడి దిగుమతులు- దిగొచ్చిన వాణిజ్య లోటు

కరోనా కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ బంగారం, వెండి దిగుమతులు భారీగా పడిపోయాయి. ఏప్రిల్​-అక్టోబర్​ మధ్య పసిడి దిగుమతులు 47.42 శాతం, వెండి దిగుమతులు భారీగా 64.65 శాతం తగ్గినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటాలో వెల్లడైంది. దీనితో వాణిజ్య లోటు కూడా తగ్గినట్లు తేలింది.

INDIA GOLD IMPORTS DOWN
భారీగా తగ్గిన బంగారం దిగుమతులు

By

Published : Nov 15, 2020, 11:46 AM IST

దేశ బంగారం దిగుమతులు భారీగా తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్​ నుంచి అక్టోబర్ మధ్య పసిడి దిగుమతులు 47.42 శాతం పడిపోయి.. 9.28 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో డిమాండ్ లేమి ఇందుకు కారణంగా పేర్కొంది. 2019-20 ఏప్రిల్​-అక్టోబర్ మధ్య కాలంలో పసిడి దిగుమతులు 17.64 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వెల్లడించింది.

విడిగా ఈ ఏడాది అక్టోబర్​లో మాత్రం పసిడి దిగుమతులు 36 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

2020 ఏప్రిల్-అక్టోబర్ మధ్య వెండి దిగుమతులు ఏకంగా 64.65 శాతం పడిపోయి.. 742 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.

పసిడి, వెండి దిగుమతుల క్షీణతతో దేశ వాణిజ్య లోటు 32.16 బిలియన్​ డాలర్లకు దిగొచ్చినట్లు వాణిజ్య శాఖ పేర్కొంది. గత ఏడాది ఇదే సమయంలో దేశ వాణిజ్యలోటు 100.67 బిలియన్​ డాలర్లుగా ఉన్నట్లు తెలిపింది.

2020-21 ఏప్రిల్-అక్టోబర్​ మధ్య దేశ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 49.5 శాతం తగ్గి.. 11.61 బిలియన్​ డాలర్లుగా నమోదయ్యయి.

ఇదీ చూడండి:బైడెన్ రాకతో ద్వైపాక్షిక వాణిజ్య బంధం బలపడేనా?

ABOUT THE AUTHOR

...view details