తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రపంచ వృద్ధి రేటును అరశాతం కుదించిన ఐఎంఎఫ్​ - అంతర్జాతీయ ద్రవ్య నిధి

ప్రపంచ దేశాలకు కరోనా వైరస్​ విస్తరిస్తోన్న వేళ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్​) కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ప్రపంచ వృద్ధి రేటును అరశాతం కుదించింది. కరోనా వైరస్ ఒక ప్రాంతానికి పరిమితం కాదని... అంతర్జాతీయ సమస్య అని తెలిపింది.

imf
కరోనా

By

Published : Mar 5, 2020, 5:02 AM IST

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కరోనా వైరస్​ రూపంలో భారీ స్థాయిలో ప్రమాదం ఏర్పడిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్​) సంస్థ హెచ్చరించింది. కరోనా ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది నెమ్మదిస్తుందని తెలిపింది. గతేడాది వృద్ధి రేటు 2.9 శాతానికన్నా తక్కువగా నమోదవుతుందని తెలిపింది.

కరోనాపై స్పందించిన ఐఎంఎఫ్​ అధ్యక్షుడు క్రిస్టాలినా జార్జీవా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు.

"కరోనా ప్రాంతీయ సమస్య కాదు. ప్రపంచానికే ప్రమాదం. దీని పరిష్కారానికి అన్ని దేశాలు కలిసిరావాలి. 2020లో ప్రపంచ వృద్ధి రేటు గతేడాది కన్నా కుదించుకుపోతుంది. "

-క్రిస్టాలినా జార్జీవా, ఐఎంఎఫ్ అధ్యక్షుడు

ఈ ఏడాది ప్రపంచ వృద్ధి రేటు 3.3 శాతంగా ఉంటుందని జనవరిలో ఐఎంఎఫ్ ప్రకటించింది. కొత్త అంచనాలను బట్టి చూస్తే అరశాతం వృద్ధి రేటు తగ్గిపోతుంది.

ఫెడరల్​ బ్యాంక్​ ఆందోళన..

అమెరికా పరిశ్రమలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఫెడరల్​ బ్యాంక్​ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే పర్యటకం, ప్రయాణ రంగాలను దెబ్బతీసిన వైరస్​.. అమెరికా పరిశ్రమలకు సరుకుల రవాణా, దేశవ్యాప్త వ్యాపారాలపై ప్రభావం చూపిస్తుందని హెచ్చరించింది.

ఇతర దేశాల్లో వేగంగా..

చైనాలో కరోనా ప్రభావం రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నా... ఇతర దేశాలకు వేగంగా వ్యాపిస్తోంది. వైరస్​ వ్యాప్తి చెందిన దేశాల్లో మరణాల సంఖ్య పెరుగుతోంది. చైనా తర్వాత ఇటలీలో 107 మంది మరణించారు. ఇరాన్​లో మృతుల సంఖ్య 92కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 3,100 మందికిపైగా కరోనా బారిన పడి మృతిచెందారు.

ABOUT THE AUTHOR

...view details