కస్టమర్లకు, సప్లయర్లకు ఇచ్చే క్యాష్-బ్యాక్, గిఫ్ట్ ఓచర్లను వస్తువులుగా పరిగణించనున్నట్లు అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) స్పష్టం చేసింది. దీనితో వీటికి 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని వెల్లడించింది.
గిఫ్ట్, క్యాష్ బ్యాక్, ఈ-ఓచర్లు జీఎస్టీ పరిదిలోకి వస్తాయా? అని బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ప్రీమియర్ సేల్స్ ప్రమోషన్ లిమిటెడ్ ఏఏఆర్ను సంప్రదించగా.. ఈ వివరాలు వెల్లడయ్యాయి.
జీఎస్టీ వసూళ్లు 26.6 శాతం
2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ.. జీఎస్టీ వసూళ్ల అదాయపు లక్ష్యంలో..ఇప్పటికే 26.6 శాతం సాధించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు. లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో(ఏప్రిల్-జూన్ మధ్య ) రూ.1.67 లక్షల కోట్లకుపైగా జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ వసూళ్ల అంచనా రూ.6.30 లక్షల కోట్లుగా ఉన్నట్లు గుర్తు చేశారు.
ఇదీ చదవండి:20 బ్రాండ్లపై పీవీ సింధు దావా! కారణమేంటి?