2019-20 ఆర్థిక సంవత్సరానికి స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిరేటుకు సంబంధించి ముందస్తు అంచనాలను వెలువరించింది కేంద్రం. ఈ ఆర్థిక సంవత్సరంలో 5 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ వృద్ధి రేటు గతేడాదితో పోలిస్తే 1.8 శాతం తక్కువ కావడం గమనార్హం. 2018-19 సంవత్సరం వృద్ధి రేటు 6.8శాతం.
2019-20లో జీడీపీ వృద్ధి రేటు 5 శాతమే
2019-20 ఆర్థిక సంవత్సరానికి స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి అంచనాలను వెలువరించింది కేంద్రం. ఈ ఆర్థిక సంవత్సరంలో 5 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని లెక్కగట్టింది.
2019-20లో జీడీపీ వృద్ధి రేటు 5 శాతమే
తయారీ రంగ ప్రభావం
తయారీ రంగం నెమ్మదించడం వల్ల జీడీపీ వృద్ధిపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతంగా ఉన్న తయారీ రంగ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరానికి 2 శాతానికి తగ్గే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేసింది. వ్యవసాయం, నిర్మాణ రంగం, విద్యుత్, గ్యాస్ వంటి రంగాల్లో ప్రగతి పడకేయడం కూడా ఈ క్షీణతకు కారణమని గణాంకాల కార్యాలయం పేర్కొంది. మైనింగ్, ప్రజా పరిపాలన, రక్షణ రంగాలు స్వల్ప వృద్ధి కనబర్చాయని స్పష్టం చేసింది.
Last Updated : Jan 7, 2020, 6:50 PM IST