ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ)లో ఆర్బీఐ అంచనా వేస్తున్నదానికన్నా వేగంగా దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతున్నట్లు ప్రముఖ ఆర్థికవేత్త చరణ్ సింగ్ 'ఈటీవీ భారత్'తో అన్నారు.
చరణ్ సింగ్, ప్రముఖ ఆర్థిక నిపుణులు ఆర్బీఐ అంచనాలు ఇలా..
శుక్రవారం జరిగిన ఆర్బీఐ ఎంపీసీ సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఇలా చేస్తున్నట్లు తెలిపింది.
ఈ సమావేశంలో వృద్ధి రేటు అంచనాలు మాత్రం సానుకూలంగా ఉన్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు క్షీణత అంచనాను.. 9.5-9.8 శాతం(అక్టోబర్ సమీక్ష అంచనా) నుంచి 7.5 శాతానికి తగ్గించింది.
2020-21 క్యూ3లో వృద్ధి రేటు 0.1 శాతం, నాల్గో త్రైమాసికంలో 0.7 శాతంగా నమోదవ్వొచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది ఆర్బీఐ.
అయితే ఆర్బీఐ అంచనాలు బాగున్నా.. భారత్ ఇంకా వేగంగా పుంజుకుంటున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)కి చెందిన ఇండిపెండెంట్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ (ఐఈఓ) మాజీ సీనియర్ ఆర్థిక వేత్త, ప్రొఫెసర్ చరణ్ సింగ్ పేర్కొన్నారు. 2020-21 మొదటి త్రైమాసికంతో పోలిస్తే.. క్యూ2లో పండుగ సీజన్ వల్ల డిమాండ్ భారీగా పెరిగిందని వివరించారు. రానున్న త్రైమాసికాల్లో ఇంకా వేగంగా వృద్ధి రేటు రికవరీ అవుతుందని అంచనా వేశారు.
ఇవీ చూడండి: