తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐదేళ్ల కనిష్ఠానికి జీడీపీ వృద్ధిరేటు - NBFC

2018-19 ఆర్థిక సంవతర్సం చివరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు ఐదేళ్ల కనిష్ఠానికి తగ్గింది. జనవరి-మార్చిలో 5.8 శాతంగా నమోదైంది. వ్యవసాయం, తయారీ రంగాల్లో మందగమనమే ఇందుకు కారణమని కేంద్ర గణాంక కార్యాలయం స్పష్టం చేసింది.

ఐదేళ్ల కనిష్ఠానికి జీడీపీ వృద్ధిరేటు

By

Published : May 31, 2019, 7:44 PM IST

2018-19 జనవరి-మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 5.8శాతానికి తగ్గింది. గత ఐదేళ్లలో ఇదే కనిష్ఠం. ఇదే త్రైమాసికంలో చైనా 6.4శాతం వృద్ధి రేటు నమోదుచేసింది.

వ్యవసాయం, తయారీ రంగాల్లో ప్రగతి మందగించడమే వృద్ధి నెమ్మదించడానికి కారణమని కేంద్ర గణాంకాల కార్యాలయం వివరించింది.

2018-19 ఆర్థిక సంవత్సరం మొత్తంగా 6.8శాతం వృద్ధిరేటు నమోదైనట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం వెల్లడించింది. 2017-18లో ఇది 7.2శాతంగా ఉంది.
చివరిసారిగా 2013-14లో జీడీపీ వృద్ధి రేటు కనిష్ఠంగా 6.4శాతం నమోదైంది. ఆ తర్వాత అంతటి స్థాయికి ప్రగతి సూచీ దిగజారడం ఇదే తొలిసారి.

మరికొంత కాలం అంతే....

"2018-19 చివరి త్రైమాసికంలో వృద్ధి నెమ్మదించడానికి బ్యాంకింగేతర ఆర్థిక రంగం-ఎన్​బీఎఫ్​సీలో సంక్షోభమే కారణం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలోనూ వృద్ధి ఇలానే తక్కువగా ఉండొచ్చు. రెండో త్రైమాసికం నుంచి ప్రగతి రథం వేగం పుంజుకుంటుంది."
-ఎస్​సీ గార్గ్​, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి

ఇదీ చూడండి: షాక్​: 45 ఏళ్ల గరిష్ఠానికి నిరుద్యోగం

ABOUT THE AUTHOR

...view details